ముంబైలోని బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) హెడ్క్వార్టర్స్ కు బాంబు బెదిరింపు వచ్చింది. BMCని పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.