ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు

55చూసినవారు
ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు
జమ్మూ-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో రైలును పంజాబ్‌లోని కాసుబేగు స్టేషన్‌లో పోలీసులు నిలిపివేశారు. అనంతరం బాంబు స్క్వాడ్ సిబ్బంది అక్కడికి చేరుకుని రైలులోని అన్ని బోగీలలో క్షుణ్నంగా తనిఖీలు చేశారు. బాంబు లేదని గుర్తించడంతో ప్రయాణికులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్