మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం టాయిలెట్‌లో బెదిరింపు లేఖ కనిపించింది. దీంతో అప్రమత్తమైన పైలట్, విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారమిచ్చి వెంటనే దాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో అత్యవసరంగా దించేశారు. విమానంలో 69 మంది ప్రయాణికులు ఉండగా వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిని బస్సులో హైదరాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం.