తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 30కి పైగా రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇందులో కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించింది. ఆ రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. రద్దయిన వాటిలో సికింద్రాబాద్-గుంటూరు (గోల్కొండ ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం-సికింద్రాబాద్ (వందేభారత్)తో పాటు పలు ప్యాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి.