ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌కి బాంబు బెదరింపులు వచ్చాయి. తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని ఉత్తరప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఏదీ అనుమానాస్పదంగా కనిపించలేదని, అది బూటకపు బెదిరింపు అని పోలీసులు వెల్లడించారు.