AP: అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మృతితో తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం జై నిరూప్ అనే బాలుడిని తల్లి స్కూటీపై స్కూల్‌కు తీసుకెళ్తుండగా.. మెసానిక్ గ్రౌండ్ వద్ద అదుపు తప్పి కిందపడ్డారు. అయితే వెనకాలే వస్తున్న ట్రాక్టర్ బాలుడి తలపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. కొడుకు నడిరోడ్డుపై విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.