బాలుడ్ని కట్టేసి రోజంతా దాడిచేశారు(వీడియో)

3446చూసినవారు
బీహార్ లోని సమస్తిపూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక రూపాయి దొంగిలించాడనే ఆరోపణతో 14 ఏళ్ల బాలుడిని కట్టేసి రోజంతా దాడి చేశారు. మోతిషా అనే వ్యక్తి తన దుకాణంలో రూపాయి విలువైన చాక్లెట్లు దొంగిలించాడనే నెపంతో తన అనుచరులతో కలిసి కుమార్ అనే బాలుడిని తీవ్రంగా హింసించారు. ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు దారుణంగా చితకబాదారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్