దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు ముందుగా వచ్చే అమావాస్య నుంచి భక్తులు దీక్ష చేపట్టి కంకణ ధారణ మొదలు బన్నీ ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు. కొండపై నుంచి బయలుదేరిన విగ్రహాలు తిరిగి 'నెరణికి' అనే గ్రామానికి చేరేవరకు కట్టుబాట్లు పాటిస్తారు. 12 రోజుల పాటు కనీసం కాళ్లకు చెప్పులు వేసుకోకుండా.. మద్యం, మాంసం ముట్టకుండా పూర్తిగా బ్రహ్మచర్యం పాటిస్తారు.