పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కీలక మ్యాచ్‌లో తడబడ్డాడు. పురుషుల 57 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరిన అమన్ తీవ్రంగా నిరాశపర్చాడు. 0-10తో హిగుచి (జపాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. మ్యాచ్ మొదలైన కొన్ని నిమిషాల్లో అమన్‌పై ప్రత్యర్థి పైచేయి సాధించాడు. కాంస్య పతకం కోసం అమన్ శుక్రవారం మరో మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది.