తమిళ నటుడు విజయ్‌ పార్టీకి అధికారిక గుర్తింపు

583చూసినవారు
తమిళ నటుడు విజయ్‌ పార్టీకి అధికారిక గుర్తింపు
ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్‌ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంను (టీవీకే) ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించింది. ఈ మేరకు 'తమిళగ వెట్రి కళగం పార్టీ' ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళగ వెట్రి కళగం పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపుపై ఆ పార్టీ అధినేత విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ రాజకీయ పార్టీ చట్టపరమైన నమోదు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నామని.. అయితే ఇప్పుడు ఈసీ నుంచి గుర్తింపు లభించిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్