బ్లాక్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్లాక్ టీలో కేంప్‌ఫెరాల్ అనే యాంటాక్సిడెంట్ రొమ్ము కేన్సర్ ని అడ్డుకోవడంలో బాగా పనిచేస్తుంది. బ్లాక్ టీ క్యాన్సర్‌తో సంబంధం ఉన్న సమ్మేళనాలు, కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు బ్లాక్ టీ ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఒక కప్పు బ్లాక్ టీ సేవించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.