గుజరాత్‌లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలో సురేంద్రనగర్ జిల్లాలోని భోగావో నదిపై ఉన్న చిన్న వంతెన వరద ఉద్ధృతికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 100 మీటర్ల పొడవు ఉన్న ఈ వంతెన హబియాసర్ గ్రామాన్ని చోటిలా పట్టణంతో అనుసంధానిస్తోంది. ఈ వంతెనను ఐదేళ్ల క్రితమే నిర్మించారు. బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.