విదేశాల నుంచి కలుషిత ప్లాస్మాను దిగుమతి చేసుకున్న బ్రిటన్

56చూసినవారు
విదేశాల నుంచి కలుషిత ప్లాస్మాను దిగుమతి చేసుకున్న బ్రిటన్
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలను పాటించుకోకుండా.. కలుషిత ప్లాస్మాను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్రిటన్ నేడు వణికిపోతుంది. ఆ కలుషిత రక్తంతో చికిత్స పొందిన వేలాది మంది రోగులు మంది హెచ్‌ఐవీ, హెపటైటస్ వంటి రోగాల బారిన పడ్డారు. ఇప్పటికే వీరిలో 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు దశాబ్దాల కిందట జరిగిన ఈ స్కామ్‌ను బ్రిటన్ ప్రభుత్వం తాజాగా బయటపెట్టింది.