పాలస్తీనాకు ప్రత్యేక దేశంగా ఐర్లాండ్ గుర్తింపు

83చూసినవారు
పాలస్తీనాకు ప్రత్యేక దేశంగా ఐర్లాండ్ గుర్తింపు
ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని సైమన్ హారిస్, విదేశాంగ మంత్రి మిచెల్ మార్టిన్ బుధవారం ప్రకటించనున్నారు. ఇరుదేశాల మధ్య శాంతి చిగురించాలని పాలస్తీనాకు ప్రత్యేక దేశం హోదా కల్పించడమే పరిష్కారమని యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్