MLC ఎన్నికలకు BRS దూరం!

53చూసినవారు
MLC ఎన్నికలకు BRS దూరం!
TG: రాష్ట్రంలో MLC ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని BRS నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించకూడదని, ఎవరికీ మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ వద్ద KTR, హరీశ్‌రావు సహా ముఖ్యనేతలు సమావేశమైన సందర్భంగా ఈవిధమైన సంకేతాలు అందినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్