టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం

59చూసినవారు
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం
AP: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెలా చివరి మంగళవారం సమావేశం కావాలని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, చేపట్టాల్సిన పనులపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి తగ్గట్లుగా ప్రతినెలా అజెండాను సిద్ధం చేసి బోర్డు ముందు ఉంచాలని అధికారులను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్