వ్యక్తి దారుణ హత్య (వీడియో)

70135చూసినవారు
ఏపీలోని బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. గుడ్డికాయలంక గ్రామానికి చెందిన ఎర్రగళ్ల సుబ్బారావు (48) అనే వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. మొండెం నుంచి తలను వేరు చేసి ఎత్తుకెళ్లారు. మృతుడు పలు కేసుల్లో ముద్దాయి అని, రౌడీ షీటర్ అని పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన వారు కూడా పలు కేసుల్లో ముద్దాయిలని, మద్యం సేవించిన తర్వాత ఏర్పడిన ఘర్షణల్లో హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్