విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆరు రకాల అరుదైన లైఫ్ సేవింగ్స్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. వీటిపై దిగుమతి సుంకాన్ని 5 శాతం తగ్గించినట్టు తెలిపారు. అలాగే 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించారు. అలాగే, భవిష్యత్తులో ఎటువంటి ఆహార సమస్య ఉత్పన్నమైనా.. తట్టుకుని.. ఆహార భద్రతను కల్పించేందుకు జీన్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.