చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం వస్తోంది. ఈ కారు బ్యాటరీ 24 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్ అవడంతోపాటు, 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్‌లో 2025 Q1 (క్వార్టర్1)లో ఈ కారు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. ఇండియాలో ఈ కార్ల ధర రూ.41 లక్షల వరకు ఉంటుందని, ప్రాంతాన్ని బట్టి ధరల్లో వేరియేషన్స్ ఉంటుందని వెల్లడించింది.