జైలు నుంచి ఎంపీగా లోక్‌సభకు వెళ్లొచ్చా?

83చూసినవారు
జైలు నుంచి ఎంపీగా లోక్‌సభకు వెళ్లొచ్చా?
ఈ ఎన్నికల్లో అమృత్‌పాల్ సింగ్‌, ఇంజినీర్‌ రషీద్‌ ఎంపీలుగా జైలు నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో జైలు నుంచి ఎంపీగా లోక్‌సభకు వెళ్లొచ్చా? అనే సందేహం నెలకొంది. అయితే జైల్లో ఉన్నవారు సభకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదు. అయినప్పటికీ వారు తాము సభకు హాజరుకాలేకపోతున్నామని స్పీకర్‌కు లేఖ పంపాలి. స్పీకర్ వారి అభ్యర్థనలను హౌస్ కమిటీకి పంపుతారు. ఆ తర్వాత కమిటీ చేసిన సిఫార్సుపై సభలో ఓటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్