కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని లేడీహిల్ ప్రాంతంలో గల నారాయణ గురు సర్కిల్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. పెట్రోల్ పంప్ సిబ్బంది బకెట్లతో నీళ్లు పోస్తూ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల్లో కారు దగ్ధమవుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.