కేరళ, తమిళనాడుకు ముంచుకొస్తున్న భారీ ముప్పు

73చూసినవారు
కేరళ, తమిళనాడుకు ముంచుకొస్తున్న భారీ ముప్పు
కేరళ, తమిళనాడు తీరాలకు ‘కల్లక్కడల్‌’ ముప్పు పొంచి ఉందని ఐఎన్‌సీవోఐఎస్‌ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.  బుధవారం రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో 0.5 మీ. నుంచి 1 మీటర్ల మేర అలల తాకిడి ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో చిన్న పడవలు, దేశవాళీ పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. పర్యటకులు బీచ్‌లలో విహారానికి రావొద్దని పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్