శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

73చూసినవారు
వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఇవాళ వేకువజామున స్వామి దర్శనం అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ వైకుంఠ ద్వాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తిరుపతిలో తొక్కిసలా జరగడం బాధాకరమన్నారు. సీఎం స్పందించి మృతుల కుటుంబాలను ఆదుకున్నారన్నారు. రోజా మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరిపై ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్