కెనడా చర్యలను తీవ్రంగా పరిగణిస్తోన్న భారత్ అదే స్థాయిలో స్పందిస్తోంది. మన దేశంలో ఉన్న కెనడా దౌత్యవేత్తలపైనా వేటు వేసింది. అక్టోబర్ 19 అర్ధరాత్రి 10 గంటల్లోపు ఆరుగురు కెనడా దౌత్యవేత్తలు భారత్ విడిచి వెళ్లిపోవాలని సూచించింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసులో ఇటీవల భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను ‘పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్’లుగా కెనడా పేర్కొనడాన్ని భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.