తమ దేశంలో ఉన్న ఖలిస్థానీయులకు పాకిస్థాన్ మద్దతు ఉందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్‌ఐఎస్) డైరెక్టర్ వనెస్సా లాయిడ్ కొన్ని వారాల క్రితమే తెలిపారు. "భారత ప్రభావం తగ్గించేందుకు పాకిస్థాన్ స్థిరంగా పనిచేస్తోంది. నేరుగా ఖలిస్థానీ వేర్పాటువాదంపై ఇస్లామాబాద్ ప్రభావం ఉంది’’ అని సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన విచారణలో లాయిడ్ పేర్కొన్నారు. దీనిపై ట్రూడో సర్కారు నోరు మెదపడం లేదు.