మెగా డాటర్ నిహారిక తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తన విడాకులపై మాట్లాడారు. అయితే నిహారిక వ్యాఖ్యలపై ఆమె మాజీ భర్త చైతన్య స్పందించారు. నిహారికపై వచ్చిన నెగిటివిటీని దూరం చేసేందుకు చేసే ప్రయత్నం అభినందనీయమని అన్నారు. కానీ, పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయడం మంచిది కాదని, పైగా సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలను చెప్పడం అస్సలు మంచిదికాదని చైతన్య తెలిపారు. విడాకుల విషయంలో ఒకరి వైపు నుంచి మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు.