డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేశారని..ప్రజలను కొత్త కొత్త బ్రాండ్ల మద్యానికి బానిసలుగా చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మద్యపాన నిషేధం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. అయితే మద్యానికి బానిసలుగా మరారని ప్రజల కోసం డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.