గుజరాత్‌లో చాందిపుర వైరస్ కలకలం రేపుతోంది. ఆ వైరస్ బారినపడి ఇప్పటికే సబర్‌కాంతా జిల్లాలో ఒక చిన్నారి మరణించాడు. తాజాగా వడోదర జిల్లాలో మరో మరణం సంభవించింది. దాంతో గుజరాత్‌లో రెండో మరణం సంభవించినట్లయ్యింది. ఇటీవల అస్వస్థతకు గురైన ఆరేళ్ల బాలుడిని ఎస్‌ఎస్‌జీ ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి కేవలం 10గం వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడి వైద్య పరీక్షల రిపోర్టులో చాందిపుర వైరస్ సోకినట్లు గుర్తించారు.