పార్టీ నేతలతో నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు

67చూసినవారు
పార్టీ నేతలతో నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేతలతో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై బీజేపీ ప్రతిపాదనలు, రాష్ట్ర మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇదే అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్