అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఏరోస్పేస్ అంకుర సంస్థ ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో ‘చంద్రయాన్-4’ మిషన్లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా.. 108 దేశాలకు చెందిన 12 వేలమంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు ‘శక్తిశాట్’ అనే మిషన్ను ప్రారంభించింది.