ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో రూ.50 వేల రాయితీ కూడా ఇవ్వనుంది. రాయితీ పోనూ మిగతా రుణంపై వడ్డీ ఉండదు. వ్యాపారం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, తయారీ, సేవా రంగంలో ఉన్నవారికి ఈ రాయితీ రుణాలు ఇవ్వనుంది. తీసుకున్న మొత్తాన్ని 24 నుంచి 60 నెలల్లో వాయిదా పద్ధతుల్లో తీర్చాల్సి ఉంటుంది. రాయితీని చివర్లో మినహాయిస్తారు.