ఉన్నతి పథకం కింద ఈ ఏడాదికి ఎస్సీలకు రూ.150 కోట్ల రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రప్రభుత్వం నిధుల విడుదలతో సంబంధం లేకుండా ఇప్పటికే సెర్ప్ పరిధిలో నిధులు ఉన్నాయి. ఈ పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులు క్రమం తప్పకుండా రుణ వాయిదాలు చెల్లిస్తున్నారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందే రాయితీని వీరికి వర్తింపచేస్తే ఆదాయాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.