తెలంగాణలో ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోఫార్మూలా-ఈ రేసుపై చర్చకు BRS సభ్యులు పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ అసెంబ్లీని కాసేపు వాయిదా వేశారు. అసెంబ్లీ తాజా పరిస్థితులపై సీఎం రేవంత్ ఆరా తీశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభలో BRS ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్ పై వేశారని కాంగ్రెస్ మండిపడ్డ విషయం తెలిసిందే.