చెడ్డీ గ్యాంగ్‌: ఒకే రాత్రి ఆరు దుకాణాల్లో చోరీ (Video)

81చూసినవారు
మహారాష్ట్రలోని నాసిక్‌‌లో చెడ్డీ గ్యాంగ్‌ వరుసదాడులకు పాల్పడుతోంది. మలేగావ్‌ ప్రాంతంలో ‘చెడ్డీ-బనియన్‌’ గ్యాంగ్‌ బుధవారం అర్ధరాత్రి సమయంలో పలు దుకాణాల్లో చోరీకి పాల్పడింది. ఎరువులు, హార్డ్‌వేర్‌, విద్యుత్‌ పంపులు విక్రయించే ఆరు దుకాణాల్లోకి చొరబడ్డ ఈ గ్యాంగ్‌.. రూ. లక్షల విలువైన వస్తువులను అపహరించుకుపోయింది. ఆయా షాపుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ముఠా దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్