మహిళా జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వైద్యురాలి హత్యాచారం జరిగిన ఆస్పత్రిలో ఆయన ఆర్థిక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.