పులులు, సింహాలు కొన్నిసార్లు ఇళ్లల్లోకి చొరబడి పెంపుడు జంతువులపై దాడి చేసిన ఘటనలు చూసే ఉంటాం. ఇదే కోవలో ఓ ఇంట్లోకి చొరబడిన చిరుతపులికి అనుకోని షాక్ తగిలింది. ఓ పెంపుడు కుక్కను చూసి చిరుత సైలెంట్‌గా ఓ ఇంట్లోకి దూరింది. అది కుక్కపై దాడి చేయాలని ప్రయత్నించగా అక్కడే ఉన్న మరో రెండు కుక్కలు దానిపై ఎదురు దాడి చేశాయి. ఈ క్రమంలో పులి వాటిపై దాడి చేయాలని చూసిన కుక్కలు దానికి అవకాశాం ఇవ్వలేదు. ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది.