ఐదు నెలల వయసున్న చీతా పసికూన మృతి చెందినట్లు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు. ఆఫ్రికా ఖండంలోని నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి భారత్‌కు చీతాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. నేషనల్ పార్కులోని మిగిలిన 13 పెద్ద చీతాలు మరియు 12 పసికూనలు ఆరోగ్యంగా ఉన్నట్టు కునో అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఫారెస్ట్ అధికారి ఈ సందర్భంగా వెల్లడించారు.