బిహార్‌లోని ఓ జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన చైనీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్సుకు చెందిన లీ జియాకీ సరైనా పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించాడు. జూన్6వ తేదీన బ్రహ్మపురలోని లక్ష్మీచౌక్ వద్ద తిరుగుతుండగా సరైన వీసా పత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఫారనర్స్ యాక్ట్ కింద లీపై కేసు నమోదు చేశారు.