జార్ఖండ్ రాజధాని రాంచీలో బీజేవైఎం శనివారం చేపట్టిన ర్యాలీలో పోలీసు సిబ్బందితో పార్టీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. దీంతో ఒకేసారి ఏకంగా 12,051 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ 12,051 మందిలో 51 మందికి ఘర్షణల్లో ప్రమేయం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. కేసులు నమోదైన వారిలో పార్టీ జార్ఖండ్ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు అమర్ కుమార్ బౌరీ, కేంద్ర మంత్రి సంజయ్ సేథ్, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ ముండా కూడా ఉన్నారు.