రామ్మూర్తి నాయుడు మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నా తమ్ముడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోాయాడని బాధాతృప్త హృదయంతో తెలియజేస్తున్నా. రామ్మూర్తి ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించారు. మా నుంచి దూరమై మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.