శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ రాజీనామా

63చూసినవారు
శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ రాజీనామా
పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ రాజకీయ నేత, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దల్జీత్ సింగ్ చీమా ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా, 2008 నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్ష పదవిలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కొనసాగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్