కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో షూటర్ తుపాకీ పనిచేయకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. 108వ వార్డు కౌన్సిలర్ సుశాంత ఘోష్ తన నివాసం ముందు కూర్చుని ఉండగా ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చారు. వారిలో ఒకరు అతనిపై రెండుసార్లు కాల్పులు జరిపాడు. కానీ తుపాకీ ఫైర్ కాకపోవడంతో దుండగుడు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే కౌన్సిలర్, స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.