రేవంత్ ప్రతిపాదన.. సాధ్యం కాదన్న సీఎం చంద్రబాబు

1069చూసినవారు
రేవంత్ ప్రతిపాదన.. సాధ్యం కాదన్న సీఎం చంద్రబాబు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలంతా కలిసి రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలపై కేంద్రం వద్దకు వెళ్తే బాగుంటుందని సీఎం రేవంత్ సూచించారు. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నందున రాజకీయంగా అది సాధ్యం కాదని చంద్రబాబు బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిల్లో కలిసి ప్రయత్నం చేయవచ్చని సూచించారు. అలాగే రెండు రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య వీలైనన్ని సమావేశాలు జరిపి సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్