తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రవాసుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. శనివారం సింగపూర్‌లో నిర్వహించిన తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రోహిణ్ రెడ్డి పాల్గొన్నారు.