ఏపీ సీఎం చంద్రబాబునాయుడి సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.