'మన్మథుడు' ఫేమ్, హీరోయిన్ అన్షు గురించి డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 'మజాకా' సినిమా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. 'చాలా ఏళ్ల తర్వాత అన్షు మళ్లీ నటిస్తున్నారు. ఆమె కొంచెం సన్నబడింది. అందుకే తిని పెంచమ్మా. తెలుగుకు సరిపోదు. అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా' అని వ్యాఖ్యానించారు. దీంతో ఇలాంటి వాళ్లను బ్యాన్ చేయాలని నెటిజన్లు ఫైరవుతున్నారు.