ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు

56చూసినవారు
ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు
సంక్రాంతి పండుగ వేళ వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో సోమ, మంగళ, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాయలసీమలో సైతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

సంబంధిత పోస్ట్