తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కాగా, కొన్ని రోజులుగా జిష్ణుదేవ్ వర్మ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం.. మంత్రులతో కలిసి వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.