అల్లు అర్జున్ అరెస్ట్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ స్పందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతరాహిత్యంగా వ్యవహారించాడని పేర్కొన్నారు. థియేటర్‌కు వచ్చి సినిమా చూసేందుకు పోలీసులు అసలు అనుమతి ఇవ్వలేదని, అయినా అల్లు అర్జున్ రోడ్డు చేసుకుంటూ థియేటర్‌కు వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నా పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక్కరు రాకపోవడం బాధకరమన్నారు.