పులికి చుక్కలు చూపించిన నాగుపాము (Video)

2596చూసినవారు
సోషల్ మీడియాలో మహారాష్ట్ర చంద్రాపూర్‌లోని తడోబా టైగర్ రిజర్వ్ పార్క్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ పెద్దపులి రోడ్డుపై తాపీగా నడుస్తూ వెళ్తుంటుంది. కాస్త దూరం వెళ్లగానే ఓ పిల్ల కాలువ వద్ద సడన్‌గా నాగుపాము కనిపిస్తుంది. బుసలుకొడుతున్న నాగుపామును చూడగానే పులి భయంతో అక్కడే ఆగిపోతుంది. కాలువ అవతలి వైపు పులి, ఇవతలి వైపు నాగుపాము ఉంటాయి. పక్కకు కదిలితే పాము ఎక్కడ కాటేస్తుందో.. అనే భయంతో పులి అలాగే కదలకుండా ఉండిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్